తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు.
తన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిరసన తెలుపుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఆయన వైసీపీకి దూరమైయ్యారు. తన నియోజవకర్గంలోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తి చేశారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ భారీగా ప్రలోభాల పర్వం కొనసాగింది.
విశాఖే రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖకు ఫిఫ్ట్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించారు.
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేయలేదని ఆయన గుర్తుచేశారు. వైయస్, చంద్రబాబు కూడా అభ్యర్థులను నిలపలేదన్నారు. జగన్ అభ్యర్థులను నిలపడమే కాకుండా అక్రమ మార్గాల్లో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చారని చెప్పారు. 15 వేల ఓట్లు తిరుపతిలోనే ఎక్కించారని తెలిపారు. ఎక్కడ దొంగ ఓట్లు…