AP-TS MLC Election: తెలుగు రాష్ట్రాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ విషయంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా బ్యాలెట్ పేపర్లను పరిశీలించి ముందుగానే చెల్లని ఓట్లను పక్కకు పెట్టేశారు. కాగా.. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఇక.. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించట్టుగా వెల్లడించారు. కాగా.. మొత్తం 752 ఓట్లు పోలవ్వగా.. నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు రాగా.. 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు.
Read also: 144 section kcr residence: 2వ సారి ఈడీ విచారణకు కవిత.. ఢిల్లీలో కేసీఆర్ నివాసం వద్ద 144 సెక్షన్..
తెలంగాణలోనూ మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతోంది. స్టేడియం చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. మొత్తం 28 టేబుళ్లలో ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. సూపర్ వైజర్లు, పరిశీలకులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్నారు. తొలి రౌండ్‌లో ఫలితం తేలకపోతే రెండో రౌండ్‌లో లెక్కించేందుకు రిటర్నింగ్ అధికారి ప్రియాంక కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కౌంటింగ్ దాదాపు గా 1300 ల మంది సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల చేశారు. ఈ నెల 13న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే..
Bandi sanjay: సరే ఆరోజే రండి.. బండి సంజయ్ లేఖపై స్పందించిన మహిళా కమీషన్