ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Also Read: Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు.. సీఈసీకి చంద్రబాబు లేఖ
ఏలూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 80.63% శాతం పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి ఉషశ్రీచరణ్ పట్టభద్ర ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎండిఓ కార్యాలయంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌరు శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: JanaSena: రేపే జనసేన అవిర్భావ సభ.. వారాహి వాహనంలో పవన్
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ స్థానానికి మెుత్తం 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో అత్యధికంగా 49 మంది బరిలో ఉన్నారు. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గానూ 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కడప, అనంతపురం గ్రాడ్యుయేట్ బరిలో 49 మంది, కడప అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండనుంది.