Musi River: శనివారం నాడు నాగోల్ లో STPని గ్రేటర్ పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో STP లను గ్రేటర్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. నగరంలో 320 MLD సామర్ధ్యంతో అతిపెద్ద నాగోల్ STP నిర్మించారు. తమ ప్రభుత్వంలో నిర్మాణము పూర్తి అయిన ఈ STP ని వెంటనే ప్రారంభం చేయాలని డిమాండ్ చేసారు వారు. ఈ సందర్బంగా కేటీఆర్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ,…
హిమాచల్‌ప్రభుత్వం అసెంబ్లీలో సరికొత్త బిల్లును ఆమోదించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకూడదని శాసనసభలో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పింఛన్ అందదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజాప్రతినిధుల లంచాల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్…
అనర్హత పిటిషన్‌లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.
ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్‌కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు శివసేనకు నోటీసులు జారీ చేసింది. జూన్ 2022లో చీలిక తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో షిండే గ్రూప్…