ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైనా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. దీంతో ఆయన జైలు నుంచే పరిపాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనకు సంబంధించిన విషయాలు శాసనసభ్యులతో చర్చించేందుకు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన.. తన ఆరోగ్యం క్షీణించిందని.. తనను పరీక్షించడానికి వర్చువల్‌గా వ్యక్తిగత డాక్టర్ అభిప్రాయాలు తెలుసుకునేలా అవకాశం కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. దీనిపై స్పందించడానికి ఈడీ సమయాన్ని కోరింది. దీంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానాలు ఎలాంటి తీర్పు ఇస్తాయో చూడాలి. ఇప్పటికే బెయిల్ పిటిషన్లు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్లపై ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Delhi Crime: దారుణం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి భార్య, బావమరిదిని హత్య చేసిన భర్త
ఇక గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. విషాదంలో నెటిజన్లు
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
ఇది కూడా చదవండి: MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు