రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర…
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు.. మిగిలిన రెండేళ్లు కార్యకర్తల్ని అక్కున చేర్చుకుని మంచి చేస్తే మరోసారి ఎమ్మెల్యేలు అవుతారన్న ఆయన.. లేక పోతే పుట్టగతులు కూడా ఉండవు అంటూ హెచ్చరించారు.. ఇక, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించబోనంటూ వార్నింగ్ ఇచ్చిన బాలినేని.. ఈ విషయంలో నాపై సీఎం వైఎస్ జగన్ కి ఫిర్యాదులు చేసుకున్నా భయపడేదిలేదన్నారు. Read Also: Telangana:…
వరసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటోంది టీఆర్‌ఎస్ పార్టీ. ఎన్నికల క్షేత్రానికి కావాల్సిన రణతంత్రాన్ని పక్కాగా రచిస్తోంది. ఇందులో కీలకం ఐపాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం. గతంలో ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసింది. ఆయా రాజకీయ పార్టీల నిర్మాణం.. కార్యక్రమాల అమలు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఐపాక్. ఆ అనుభవంతోపాటు తెలంగాణలో ఉన్న పరిస్థితి… టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న ప్లస్సులు.. మైనస్‌లపై గ్రౌండ్ రిపోర్ట్స్‌ను ఎప్పటికప్పుడు…
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించి ఫుల్ జోష్‌తో ఉన్న కమలనాథులకు షాకిచ్చే కామెంట్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. అప్పుడే ఆట ముగిసిపోలేదని.. మున్ముందు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలలో సగం మంది కూడా లేని బీజేపీకి ఈ ఎన్నిక అంత ఈజీ కాదన్నారు. ప్రతిపక్ష పార్టీలకే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పుకొచ్చారు మమత. యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎస్పీ వంటి…
మనల్ని పాలించే నేతలు ఎలా వుండాలి? వారి ప్రవర్తన ఎలా వుండాలి? అనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడలో విద్యార్థులతో ముఖాముఖి లో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు కులం మతం చూసి ఎన్నుకోకూడదన్నారు. నేతల కులం కన్నా గుణం మిన్న అన్నారు వెంకయ్యనాయుడు. మంచి వారిని సేవా భావం ఉన్న వారిని ప్రోత్సహించాలి నాయకుడిగా ఎన్నుకోవాలి. పార్లమెంట్ కి అసెంబ్లీకి పోయి మాట్లాడేటప్పుడు సభ్యతతో సంస్కారంతో…
పార్టీ ఫిరాయింపు దారులను బీజేపీ ప్రొత్సాహిస్తుందని అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్ తన అధ్యయనంలో వెల్లడించింది. 2014 నుంచి 21 మధ్య దేశ వ్యాప్తంగా 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి కాషాయ కండువా కప్పుకునట్లు తెలిపింది. అంతేగాక వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్ధులు బీజేపీ తీర్థం పుచుకున్నట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. గత ఏడేళ్లలో పార్టీ ఫిరాయింపులతో అత్యధికంగా బీజేపీ లాభపడగా, ఎక్కువగా నష్టపోయిన పార్టీగా…
ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…
ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని సరిగా లేదని… అయన్ను వెంటనే మార్చాల్సిందేనని సిద్ధూ వర్గం నేతలు పట్టుబట్టారు. అవసరం అయితే, సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఇంతలోనే పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు హరీష్‌రావత్… అసంతృప్తవర్గానికి చెందిన నలుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరించారని…