సీఎం కేసీఆర్ ఈ నెల 12 వ తేదీని భువనగిరి శివార్లలోని రాయగిరిలో బహిరంగ సభ ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జగదీశ్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా…