తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ అమెరికా పర్యటనలో కొంత సమయం జాలిగా గడిపారు. షికాగో సరస్సు తీరంలో సరదాగా సైకిల్ తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో అందర్నీ ఆకర్షించింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేబినెట్‌లో కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదయనిధి.. డిప్యూటీ సీఎం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి.
వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి.
Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MK Stalin: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు తమిళనాడుని కేంద్ర బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారని సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి మంత్రి వర్గంలో ప్రమోషన్ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి, స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, త్వరలోనే మంత్రివర్గంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
K Annamalai: తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై డిమాండ్ చేశారు. విచారణ చేసేందుకు కేంద్ర ఏజెన్సీకి ఎందుకు అప్పగించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిద్ధంగా లేరని ప్రశ్నించారు.
Kallakurichi tragedy: ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 60 మందికి పైగా మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే జిల్లాలో ఇంత మంది చనిపోవడంపై అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్‌పై బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 63కి చేరింది. జూన్ 18న రాష్ట్రంలోని కరుణాపురం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత కల్తీ మద్యం తాగి 225 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు.