BJP: తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య ‘‘త్రిభాషా విధానం’’, ‘‘హిందీ భాష’’పై వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ భాషను తమిళనాడుపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం ఎంకే స్టాలిన్, ఆయన డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..
Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
MK Stalin: తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఈపీ) భాగంగా తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కసరత్తు జరుగనుండటంతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Stalin : భారతదేశం, శ్రీలంక మధ్య సంబంధాలలో చాలా సాన్నిహిత్యం ఉంది. కానీ మత్స్యకారుల అరెస్టు, విడుదలకు సంబంధించిన వివాదం దశాబ్దాల నాటిది. ఫిబ్రవరి 23న కూడా శ్రీలంక 32 మంది భారత జాలర్లను అరెస్టు చేసింది.
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం ఉందని అన్నారు. గతంలో కూడా స్టాలిన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గతంలో స్టాలిన్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రజలు ‘‘16 మంది పిల్లలను’’ పెంచడం గురించి ఆలోచించేలా చేస్తోందని, 16 రకాల సంపదలపై తమిళ సామెతను ఉదహరిస్తూ అన్నారు.
MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రి భాషా విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. NEP అమలు చేస్తే తమ రాష్ట్రం 2000 ఏళ్లు తిరోగమనం చెందుతుందని అన్నారు. దీనిని పాపం అంటూ పిలిచారు. కేంద్రం రూ. 10,000 కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని…
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్‌కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు,
Katchatheevu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు.
MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.