GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22…
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.