GHMC : హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో MIM విజయం
- హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో MIM విజయం
- మొత్తం పోలైన ఓట్లలో 63 ఓట్లు సాధించిన MIM
- బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకి 25 ఓట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. అయితే, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
బీజేపీ క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, అలాంటిదేమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ విజయం హైదరాబాద్‌లోని స్థానిక సంస్థలపై ఎంఐఎం పట్టును మరోసారి రుజువు చేసింది. ఎంఐఎం శ్రేణులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి.
Also Read
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
Hyderabad: నేడే హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విజయం ఎవరిది?
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!