Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
భారతదేశం మరోసారి విదేశీ గడ్డపై తన దౌత్య మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారత పౌరుల కోసం ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్ తమ పౌరులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా ఇరాన్ భారతీయ విద్యార్థుల కోసం టెహ్రాన్ తన గగనతలాన్ని తెరిచింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని కవి, బహుభాషావేత్త, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మతోన్మాదులు దాడులు చేశారు. సిరాజ్‌గంజ్ జిల్లాలోని ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం ఒక సందర్శకుడు, మ్యూజియం సిబ్బందికి పార్కింగ్ ఫీజు విషయంలో జరిగిన వివాదం తర్వాత, ఒక గుంపు దాడికి పాల్పడింది. సందర్శకుడిని నిర్బంధించిన తర్వాత దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఒక గుంపు ఆవరణలోకి చొరబడి మ్యూజియం, ఆడిటోరియంపై…
Rahul Gandhi: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆపరేషన్‌కి ముందే భారత్ పాకిస్తాన్‌కి సమాచారం ఇచ్చిందని, ఇది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి ధీటుగా బీజేపీ బదులిస్తూ, రాహుల్ గాంధీ నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించింది.
పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది.
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్‌ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్‌పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
Zakir Naik: భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్‌కి దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో జకీర్ నాయక్, మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్‌లను కలిసిన తర్వాత భారత్, పాకిస్తాన్ వైఖరి ఏమిటో తెలిసిందని వ్యాఖ్యానించింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది.
రష్యాతో సైనిక సంబంధాల కారణంగా పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా, దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికాతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భారతీయ కంపెనీలు రష్యా సైనిక-పారిశ్రామిక స్థాపనకు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయమై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.