ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు మరింత ఉపయోగకరంగా మారిందని మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ, ఈ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణ చేశారు.
ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను…
మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది.
స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరతగతిన పూర్తి చేస్తాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ,…
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించి.. టీ చేసిన సీఎం! ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ…
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లోని నబాటీహ్‌లోని మునిసిపాలిటీ భవనాలపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాడిలో కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని.. సహాయక చర్యలు…
తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్ గా రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల…