రేపు ఢిల్లీకి మంత్రి సీతక్క వెళ్లనున్నున్నారు. పెసా చట్టంపై జరిగే జాతీయ సదస్సుల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. పెసా చట్టంపై గురువారం నాడు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరుగనుంది. న్యూ ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో పెసా చట్టం అమలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున సదస్సుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా…
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె అన్నారు. కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు మంత్రి సీతక్క. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం పంపించామని,…
రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి ఆనసూయ సీతక్క మంగళవారం నాడు ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్తకు చేరుకుంది. అటవి ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుని బ్రతుకుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీవితాంతం కెసిఆర్ కుటుంబమే పరిపాలిస్తుందని బిఆర్ఎస్ నాయకులు భ్రమల్లో బతికారని, రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామికంగా ఆలోచించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారన్నారు. ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుండే కూల్చేస్తాం,కూలగొడతామంటూ అంటూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్…
మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జి షీట్ పై విచారణ మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా గత వారం సెప్టెంబర్ 11 న సిఎం కేజ్రీవాల్‌కు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేశారు. అదే తేదీ వరకు అతని…
రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని, తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమన్నారు సీతక్క. అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరని, రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం…
విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ స్కీంల అమలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని, అంగన్వాడి టీచర్లతో పాటు ఆయాలకు సైతం శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇవ్వాలని, అప్పుడే చిన్నపిల్లలకు తినడానికి అనువుగా…