Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..
- స్వయం సహాయక సంఘాలకు శుభవార్త
- సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపిన మంత్రి
- వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంత్రి ఆదేశాలతో ఇంధన కార్యదర్శికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్ ప్రతిపాదనలు పంపారు. మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వెయ్యి మేగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయిస్తే అనువైన భూములను గుర్తించి మహిళా సంఘాలకు లేదా సమాఖ్యలకు లీజుకు భూములను ఇప్పిస్తామని వెల్లడించారు.
READ MORE: Konda Visveshwar Reddy: ఖురాన్‌లో వక్ఫ్ ప్రస్తావన లేదు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Also Read
మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కేటాయించడం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. “ఒక్క మేగా వాట్ ప్లాంట్ కి రూ. మూడు కోట్ల వ్యయం సమకూరుతుంది. 10 శాతం మహిళా సంఘాలు కాంట్రిబ్యూట్ చేస్తే 90 శాతం బ్యాంకు ద్వారా లోన్లు మంజూరవుతాయి. ఇంధన శాఖ అనుమతులిస్తే వారంలోపు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ పూర్తి చేస్తాం. ఒక్క మేగా వాట్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీంను ప్రారంభించింది. ప్రజా ప్రభుత్వం. మంత్రి సీతక్క చొరవతో మహిళా సంఘాల కోసం 17 వ్యాపారాలు గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టుపని, మహిళా శక్తి క్యాంటిన్లతో పాటు పలు రకాల వ్యాపారాల్లోకి మహిళా సంఘాలు పనిచేస్తు్న్నాయి. బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తూ మహిళా సంఘాలను ప్రొత్సహిస్తోంది ప్రభుత్వం. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నాం.” అని సీతక్క తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!