కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో అల్లు అర్జున్ పై ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. అల్లు అర్జున్ విషయంలో తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
Ponnam Prabhakar : ఈనెల 16 న గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా , బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 16 వ తేదీ సోమవారం రోజున గాంధీ భవన్ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి…
Ponnam Prabhakar: మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో తెలంగాణ మంత్రులు పర్యటించనున్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
Ponnam Prabahakar: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. విజయోత్సవాల చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది.
Ponnam Prabhakar: హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైల్లోని సికా పెరేడ్ గ్రౌండ్‌లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై…
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర…