Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పట్టణంలో పలు విధులుగా గుండా పాదయాత్రగా మంత్రి వెళ్తూ ప్రజలతో ముచ్చటించారు. పట్టణంలో ప్రధాన రోడ్డు పనులు నాలా పనుల పరిశీలించారు. పలువురు మంత్రి దృష్టికి పట్టణ సమస్యలను తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే సమస్యల పరిష్కారించారు.
Read also: CPI Narayana: రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు.. డైరెక్టర్ చెప్పడం వల్లే చేసింది..
కూరగాయలు అమ్మే మహిళలతో మంత్రి ముచ్చటించారు. వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయని ఆరా తీశారు. హుస్నాబాద్ పట్టణంలో రెనోవేశన్ అవుతున్న బస్ స్టాఫ్‌ను పరిశీలించారు. బస్ స్టాండ్‌లో ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు కొత్త రూట్లలో బస్సులు కల్పించాలని కోరారు.. మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పట్టణంలో మహిళలను వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు.
SI Missing Case: మిస్టరీగా మారిన భిక్కనూరు ఎస్సై మిస్సింగ్.. నిన్న మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్‌ఆఫ్