Ponnam Prabhakar: హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైల్లోని సికా పెరేడ్ గ్రౌండ్‌లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. దీక్షాంత్ పరేడ్‌లో శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖలో 92 మంది జైల్ వార్డర్స్ (ఇందులో 84 మంది పురుష 8 మహిళలు) సికా హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు. అండమాన్ నికోబార్‌కి చెందిన జైల్ వార్డర్స్ కూడా సికాలో బేసిక్ ఇండక్షన్‌లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డర్స్‌కి మంత్రి పొన్నం మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read also: Hashish Oil: చందానగర్‌లో లక్షల విలువైన హషిష్ ఆయిల్ పట్టివేత..
పాసింగ్ ఔట్ పెరేడ్ తీసుకుంటున్న జైల్ వార్డర్స్‌కి, డిప్యూటీ వార్డర్స్‌కి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. జైళ్ల శాఖ అనగానే ఖైదీలు అని ఊహించుకుంటామని తెలిపారు. జైలు అంటే ఖైదీలు శిక్ష వేయడం కాదు.. వారిలో పరివర్తన తీసుకొస్తూ.. వాళ్ళలో నైపుణ్యాలు మెరుగుపరుస్తు జైళ్ల శాఖ పని చేస్తుందన్నారు. మీరు దేశ రక్షణలో బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలన్నారు. మీరు శిక్షణ పొంది ప్రతిజ్ఞ చేసిన విధంగా.. సమాజంలో మీరు చేసే పని సమయ పాలన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇటీవల సత్ప్రవర్తన గల 249 మంది ఖైదీలను విడుదల చేసిందన్నారు. వారికి శిక్ష వేయడం కాదు శిక్షణ ద్వారా వాటిని పరివర్తన గల ఖైదీలుగా మారుస్తుందన్నారు. ప్రొఫెషనల్ ఖైదీలపై కఠినంగా ఉంటూనే వాళ్ళలో మార్పు తీసుకురావాలని తెలిపారు. ఖైదీలు వృత్తిలో నైపుణ్యాలు సాధించి జైళ్ల శాఖ 29 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందని మంత్రి అన్నారు.
Read also: Harish Rao Arrest: పోలీసుల అదుపులో హరీష్‌రావు.. గచ్చిబౌలి పోలీస్టేషన్ కు తరలింపు..
అందులో ఖైదీలు పని చేస్తూ ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ఖైదీలు వివిధ వృత్తుల్లో నైపుణ్యం సాధించాలన్నారు. ఖైదీలు తయారు చేసిన వస్తువులను స్టాల్‌లలో అమ్ముకుంటూ.. వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది అన్నారు. నిన్న పెద్దపల్లి సభలో గ్రూప్ -4 ఉద్యోగులకు నియామక పత్రాలు అందించడం జరిగిందని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో రూ.55వేల ఉద్యోగాలను నియామకం చేయడం జరిగిందన్నారు. పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ కోసం కొట్లాడినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం అని తెలిపారు. జైళ్ల శాఖ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరారు. ఈరోజు శిక్షణ పొందిన జైళ్ల వార్డర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకొని.. రేపటి నుండి విధుల్లో చేరుతున్న మీకు శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబ సభ్యుల ముందు ఈరోజు మీరు ఫరేడ్ చేయడం అభినందనీయం అని మంత్రి అన్నారు.
Air Hostess: ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు.. ఆ తరువాత..