దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతాల్లోని పంటల సాగు, ఇతర అంశాల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించాలని, రాష్ట్రాలు నిర్ణయించిన ఎంఎస్‌పీకి కేంద్రం మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని పేర్కొంటూ, “కేంద్రం ఎమ్‌ఎస్‌పిని ప్రకటించి, సేకరణ బాధ్యతల నుండి చేతులు కడుక్కుంటోంది. ఇది శోచనీయం.” స్వామినాథన్ కమిటీ సిఫార్సులను…
హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పరకాల, నడికూడ, రేగొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లు మాట్లాడారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. నేలరాలిన మిర్చిపంటలను మంత్రులకు చూపిస్తూ.. సర్వం నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. తమను ఆదుకోవాలని మహిళా రైతులు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ అటు పార్టీ కార్యకర్తలను, రైతులను ఉత్సాహ పరుస్తున్నారు. కాగా మరోవైపు ప్రభుత్వం రైతుబంధు సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో జరిగని రైతు బంధు కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.…
భారత ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు ఆరువేల రూపాయలు ఇవ్వడానికి 100 షరతులు విధిస్తోందని, ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్ రైతులకు రైతు బంధు అమలు చేస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకంలో 92 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు ఉన్న వారేనని ఆయన వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో రైతులు ఆయిల్ ఇంజన్ తో వ్యవసాయం చేస్తున్నారని, ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్ లో ఉచిత విద్యుత్…
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని రైతులకు అందించడానికి నిధుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు బంధు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన రైతు బంధు పథకం గురంచి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకాన్ని అర్హులు అయిన ప్రతి ఒక్క రైతుకు అమలు చేస్తామన్నారు. అలాగే సోమవారం ఐదో రోజు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్ లలో జమ అయ్యాయని తెలిపారు. నేడు రూ.…
వరి కోసం తెలంగాణలో అధికార పార్టీకి విపక్షాలకు మధ్య వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో యాసంగిలో వరి ధాన్యం వేయకూడదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే విపక్షాలు మాత్రం వరి వేయండి అంటూ రైతులకు సందేశాలు ఇస్తున్నాయి. అయితే దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించండి.
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ సర్కార్ సన్నద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ భవన్‌లో విసృతస్థాయి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మొండి వైఖరిని రైతులకు చెప్పాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియోను కింద ఉన్న లింక్‌లో వీక్షించండి..
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది… ఈ మేరకు తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం.. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది.. కానీ, కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. సాగుభూమి ఏడేండ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేర్చారని తెలిపారు..…
ధాన్యం కొనుగోలుపై తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపైఒకరి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెబుతున్నారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని, తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్…