ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత…
తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు వ్యవహారంపై మరోసారి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానుంది. కృషి భవన్ లో రాత్రి 7.30 గంటలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో భేటి కానున్న రాష్ట్ర మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ భేటీకి హాజరుకానున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక…
దేశంలోనే తెలంగాణలో వరీ ఎక్కువ విస్తీర్ణంలో పండుతోందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన రైతుసాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రధాని నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు సీతారామ ప్రాజెక్ట్ తర్వాత రైతులు ఇంకా ఎక్కువ పంట వేస్తారని, పంట కొనం అంటే రైతుల కాళ్ళు కట్టేసినట్లేనన్నారు.…
తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలు విషయంలో అగ్గి రాజుకుంటోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ ల మధ్య ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇస్తూంటే.. ఇప్పడొచ్చి బీజేపీ నేతలు వరి కొనుగోలు చేయాలంటూ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లడం హాస్యస్పదం అన్నారు. అంతేకాకుండా రైతుల సమస్యల…
తెలంగాణలోని వరి రైతులు షాక్ ఇస్తూ తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. వేసవిలో వరి వేయద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీనిపై మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. విత్తనం కోసం మాత్రం వరి వేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి…
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ ‘మంగళవారం మరదలు’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడలేదని.. ఏకవచనం వాడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన భాషలో ఏదైనా తప్పు ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు. షర్మిల తన కుమార్తె కంటే పెద్దది… సోదరి కంటే చిన్నది. తండ్రి సమకాలీకుడైన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో ఆమె సంభోదించడం సంస్కారమేనా?’ అని నిరంజన్‌రెడ్డి షర్మిలకు చురకలు అంటించారు.…
నాగర్ కర్నూలులో బుధవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు బయలుదేరింది’ అంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. షర్మిల డిమాండ్ వెనుక ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. Read Also: కేసీఆర్-జగన్‌లపై రేవంత్ ట్వీట్ వార్ అయితే తనను ఉద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి…
రైతుల పాలిట తెలంగాణ సీఎం రాబందులా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వరి బంద్ పథకాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసిండు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రైతులు వరి పండించకుండా ఏమి పంట వేయాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయలేదు.. ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్ లో ఉంటాడు.. ఈయన కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేసిన బండి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి…
భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి…
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల…