Minister Narayana: అమరావతికి కేంద్ర సాయంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
- ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర సాయం..
- శాసనమండలిలో క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత… రుణం ఎంత అనేది చర్చించి చెబుతాం. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం. KFW అనే జర్మన్ బ్యాంక్ ఒక 5000 కోట్లు లోన్ ఇస్తుంది. మొత్తం 31 వేల కోట్లు అమరావతికి వివిధ రూపాల్లో వస్తున్నాయని వెల్లడించారు. అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు.. ఇక, అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు అవసరమైన భూమిని ఎలా సేకరించాలనే దానిపై చర్చిస్తున్నాం. అమరావతి డిజైన్ చేసినప్పుడే స్వయం సమృద్ధి (Self-sustainability) గా డిజైన్ చేశారని తెలిపారు..
Read Also: KTR : కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత
Also Read
ప్రస్తుతం పనులు ప్రారంభించడానికి బడ్జెట్ లో 6000 కోట్లు కేటాయించామని తెలిపారు మంత్రి నారాయణ.. ప్రజలు టాక్స్ ల రూపంలో చెల్లించిన డబ్బులు అమరావతికి వాడకూడదనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పారని పేర్కొన్నారు.. రాజధాని కోసం తీసుకున్న రుణాలను అమరావతి పూర్తయిన తర్వాత అక్కడి భూములతో రీ పేమెంట్ చేస్తాం అన్నారు నారాయణ.. బ్యాంకుల ద్వారా డబ్బులు రావడానికి లేట్ అవుతుందని.. దీంతో, ఈ బడ్జెట్‌లో కేటాయించిన 6000 కోట్లతో పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు.. అయితే, రుణాల ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత బడ్జెట్ డబ్బులు క్లియర్ చేయనున్నట్టు శాసనమండలిలలో వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!