ఏపీ పీజీసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి.. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఏపీ పీజీసెట్-2025 ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.. మొత్తం 31 బ్రాంచ్‌లలో 88.60 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు.. పీజీసెట్ -2025 కోసం 25,688 మంది నమోదు చేసుకోగా.. వారిలో 19,488 మంది అర్హత సాధించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.. వీరిలో 7463 బాలురు అంటే 87.70 శాతం.. మరియు 12025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత…
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే అందులో మూడు తప్పు ఉంటాయన్న ఆయన.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం అన్నారు.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలని సూచించారు..
అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి…
సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమైన లోకేష్.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు.
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసిన మంత్రి నారా లోకేష్.. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి…
Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు.
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ.. అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు.. సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు..