మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ హనుమ విహరి కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో.. తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని హనుమ విహారి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ హనుమ విహారి మాట్లాడుతూ.. తన టాలెంటును గత ప్రభుత్వం తొక్కేసిందని ఆరోపించారు. తానుంటే వాళ్లకి ఇబ్బందని నాటి ఏసీఏ భావించిందని తెలిపారు. చిన్న…
అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు డిమాండ్ చేస్తున్నారని విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అన్నారు. జగనుకు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ అని ఆయన పేర్కొన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 'ప్రజా దర్బార్' ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు.
ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.