వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. మేమేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదన్న ఆయన.. ఎందుకు ఈ ప్రభుత్త హయాంలో 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదు..? అని ప్రశ్నించారు.. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అని.. ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రి అక్కడే బస చేస్తారు.. ఇక, రేపు అనగా శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్.. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించనున్నారు.. యోగాంధ్ర పై తయారు చేసిన బుక్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్.
HBD Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినా.. తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్.. తాను అంటే చెప్పలేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కల్యాణ్.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఆయన.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగే .. ఇక, ఈ ఏడాది పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే ప్రత్యేకమనే చెప్పాలి.. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లోకి వచ్చిన ఆయన.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో జతకంటి.. ఏపీలో కూటమి…
మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP) లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం పంపింది ఆస్ట్రేలియన్ హైకమిషన్. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావా లని ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ…
నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్... ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్... అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ…
కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు మంత్రి నారా లోకేష్.. మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదస్పద ఘటనలపై మంత్రులతో చర్చించారు.. ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలను ప్రస్తావించారట.. మరోవైపు, రౌడీషీటర్ శ్రీకాంత్‍కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట.. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదని హితవు చెప్పారట లోకేష్.. టీడీపీ అధినేత,…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. ఉపరాష్ట్రపతి నామినేషన్.. అంతకు ముందు ఎన్డీయే పక్షాల సమావేశం ఎజెండాగా సీఎం చంద్రబాబు.. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. మరోవైపు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేష్ కూడా హస్తినకు వెళ్తున్నారు.
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్‌ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి…
దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం.