శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్.. ఇప్పటికే ఆమె మంత్రి ఫరూఖ్ తో సమావేశమై.. పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ భేటీలో ఆమె.. పార్టీలో చేరడంపై క్లారిటీ వచ్చిందని.. త్వరలో తెలుగుదేశం పార్టీలో జాకియా ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.
అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు లోకేష్.. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను అని గుర్తుచేశారు.. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు.. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి.