Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ప్రజా దర్బార్’ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్‌ను కలిసి ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలని లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ కోరింది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
Read Also: Minister Narayana: అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..
మంగళగిరి నియోజకవర్గ ప్రజల తమ దృష్టికి తెచ్చే సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజా దర్బార్‌ను నిర్వహించాలని మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు.. ప్రతిరోజూ ఉదయం నారా లోకేష్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఓవైపు మంత్రిగా మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యేగా అందరికీ న్యాయం చేసే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు.