AP Pensions: పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. స్వయంగా పెన్షన్లు అందించిన సీఎం చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రారంభం..
- పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు..
- మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పెన్షన్ పంపిణీని ప్రారంభించిన సీఎం..
- లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించి.. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే.. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన తొలి సంతకాల్లో పెన్షన్ పంపిణీ కూడా ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. గత మూడు నెలలకు రూ.1000 చొప్పున.. ఈ నెల రూ.4000తో కలిపి.. రూ.7,000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.. ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం, మంత్రి.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు.. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు..
Read Also: Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్ పాములు నాయక్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ అందజేశారు.. ఇక, గతం కంటే భిన్నంగా చంద్రబాబు పర్యటన సాగింది.. గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.. గ్రామం లోని యువకులతో ఫొటోలు దిగి భుజం తట్టి పంపించారు.. అనంతరం పెనుమాక గ్రామ ప్రజా వేదిక వద్దకు చేరుకుని.. పెనుమాకలో ప్రజలతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. గ్రామస్తుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!