బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాల మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ రైడ్స్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బోనాలు సంబరాలు అంబరాన్నంటాయి. నిన్న లాల్ దర్వాజ బోనాల సందర్భంగా బంగారు బోనాలతో.. పట్టు వస్త్రాలతో మంత్రులు, క్రీడాకారులు, నేతలు, హాజరై అమ్మవారికి సమర్పించారు. అయితే బోనాల సందర్భంగా.. ఓ అరుదైన సన్నివేశం చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ఆయన బీజేపీ పార్టీలో చేరి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై…
ఆరోగ్య సేవలో గత 20 ఏళ్లుగా దక్షిణ భారత దేశ ప్రజలకు సేవలు అందిస్తున్న డా.కేర్ హోమియోపతి 54వ బ్రాంచీని హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డా.కేర్ సీఎండీ ఏఎం రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ యూ.గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. హోమియోపతి అనేది గొప్ప వైద్య విధానంగా పేదవాళ్లు, కార్మికులు తక్కువ ఖర్చుతో…
హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్ నేత ఎస్‌ఐ కాలర్ పట్టుకొని తన అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఊరుకోదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆందోళనలు చేయడం దేనికని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని, అలాగే బీజేపీ గ్రాఫ్…
మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆదివారం రెడ్డి ఘర్జణ సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని అడ్డుకోవడంతో పాటు ఆయన కాన్వాయ్ ను అడ్డుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై తాజాగా టీఆర్ఎస్ నేతలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదు అయింది. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు.…