50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ జవహర్‌నగర్‌లోని డంప్‌యార్డుకు తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెత్తాచెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది.
Minister Mallareddy: తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు కేరాఫ్ గా మారిపోయారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఇటీవలే రైతుల పైన దుర్భాషలాడుతూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఓ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మీరు రైతులా? దున్నపోతులా? అంటూ రెచ్చిపోయారు.
తెలంగాణాలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు చేశారు అంటే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే పేరు ‘మల్లారెడ్డి’. “పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడినా” అంటూ డైలాగు చెప్పి మరీ మల్లారెడ్డి పేరుని చెప్తారు తెలంగాణా యూత్. అంతలా ఫేమస్ అయిన తెలంగాణా మినిస్టర్ మల్లారెడ్డి, ‘మేమ్ ఫేమస్’ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో తన స్టైల్ లో మాట్లాడిన మల్లారెడ్డి…
ఢిల్లీలో అతిథులకు చాయ్ ఇస్తున్న మంత్రి మల్లా రెడ్డి వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీలో బీఆర్‌ఎస్ భవన్ వద్దకు వచ్చిన నాయకులకు మంత్రి మల్లారెడ్డి పలకరించి, నాయకులకు చాయ్ కప్పులు పట్టుకుని ఉంటే వారికి తన దగ్గర వున్న మగ్గులో నిండా చాయ్ వుంది. దానిని పార్టీ నాయకులకు కప్పులో వేస్తుండటం. వారు ఆనందంగా తీసుకుని చాయ్ తాగడం ఆశక్తి నెలకొంది.
మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి రెండోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ ఐటీ ముందుకు మంత్రి రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఐటీ ముందుకు హాజరు కావట్లేదని స్పష్టం చేశారు. నేడు ఇంటి నుంచి ఓ పోగ్రామ్ కు మెడ్చేల్ కు వెళ్లిపోయారు మంత్రి. నన్ను ఐటీ వదిలేసింది కానీ, మీడియా వదలట్లేదని మంత్రి అన్నారు. మా కుటుంబం ఐటీ ముందు హాజరవుతారని పేర్కొన్నారు.