IT Raids Marri Rajashekar Reddy: బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాల మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ రైడ్స్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు మా కూతురు, తల్లిదండ్రులుతో అమానుషంగా ప్రవర్తించారని.. నేను టర్కీ నుండి వచ్చిన తరువాత మా కూతురుతో మాట్లాడినానని అన్నారు. ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో అధికారులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐతో దాడులు చేయించి బయ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Read also: Gidugu Rudra Raju: దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే..
మా ఇంట్లో సోదాలు 4 కోట్లు నగదు సీజ్ చేశారని తెలిపారు. మా తల్లిదండ్రులు, కూతురుపై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. మేము ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నామని తెలిపారు. మేము ఐటీ అధికారులు దాడులు చేసుకొచ్చు, కానీ పద్ధతి ఉండాలని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మూడు సార్లు సోదాలు చేశారని అన్నారు. కానీ ఎప్పుడు కుడా ఇలా ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించ లేదని పేర్కొన్నారు. బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు. మేము ఐటీ విచారణకు సహకరిస్తామన్నారు. మా ఇంట్లో 4 కోట్లు నగదు పత్రాలు సీజ్ చేశారని అన్నారు. మాకు మల్లారెడ్డికి ఎలాంటి ఆర్థిక సంబంధాలు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నామని, నాకు నోటీసులు ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు.