మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో సమస్యలపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట, శామీర్ పేట, ప్రాంతాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఫైర్ అయ్యారు.
Minister Malla Reddy: దేశవ్యాప్తంగా 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే జాతీయ జెండాను ప్రముఖులు ఎగరవేసి అధికారులు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్ర కోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించగా.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేసి, సెల్యూట్ చేసారు. ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం నాడు మంత్రి మల్లారెడ్డి చేసిన…
Malla Reddy: మెడికల్ కాలేజీల్లో సీట్ల కుంభకోణంపై ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేయనున్నారు. 2016 నుంచి 2022 వరకు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు గత నెలలో రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి..
మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. గౌడవెల్లి గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు 15 యూనిట్ల గొర్రెపిల్లలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేసారు.
చెంగిచెర్ల చౌరస్తాలో విద్యార్ధులతో కలిసి చిందులేస్తూ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకుని డ్యాన్సులేశారు. అలాగే విద్యార్ధులు స్టేజీపై డ్యాన్సులు వేస్తుండగా.. వారిని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం ఆయన చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన మహిళా కళాకారులతో కలిసి బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి ఆడిపాడారు.
సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన సురారం పోలీస్ స్టేషన్ ను ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ashada bonalu: హైదరాబాద్ లో ఆషాడ బోనాలు పండుగ మొదలుకానుంది. వచ్చే నెల 22న హైదరాబాద్‌లో ఆషాడ బోనాల జాతర ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఈ నెలరోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.