పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కెజి నుంచి పిజి వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళన జరగాలన్నారు మంత్రి.. ఈ క్రమంలో.. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.
విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్‌ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుండగా.. తన పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించారు లోకేష్.. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో పాటు వైస్ ప్రెసిడెంట్లతో సమావేశం..
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అప్పుడు యువగళం... ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను…
Minister Lokesh: పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై మంత్రి సీరియస్ అయ్యారు.
ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. మంత్రి నారా లోకేష్‌ను కలిసి టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో.. టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధతకు మరింత సమయం…