Minister KTR: హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్‌కో కొత్త యూనిట్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ద్వేషం, హింసకు చోటు లేదన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటుందన్నారు. హైదరాబద్‌లో విద్య, అకడమిక్, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థలు పకడ్బందీగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Chada Venkat Reddy: అంబేద్కర్ రాసిన రాజ్యాగం రాష్ట్రంలో అమలు కావడం లేదు..
హైదరాబాద్ అన్ని సంస్కృతులను స్వాగతిస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్,, ఇమేజ్ టవర్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా కోసం ఇక్కడ ఒక కేంద్రం నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అవుతుందన్నారు. దీనికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుని సిట్‌కో తెలివైన పని చేసిందన్నారు. సిట్‌కో మనీలాలో 3500 మంది ఉండగా, టొరంటో కేంద్రంలో 2500 మందే ఉన్నారు. హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్, ఉబెర్, మైక్రోన్, క్వాల్‌కామ్ వంటి సంస్థల రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు నిలయంగా హైదరాబాద్ మారిందన్నారు. సిట్‌కోకు సంబంధించిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉండాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. దానిని సాకారం చేద్దామంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Minister @KTRBRS inaugurated Citco's permanent office for the Center of Excellence team in Hyderabad.
The new state of the art office of Citco, the global alternative investment asset servicer, will cater to its ongoing expansion in the region.#happeninghyderabad pic.twitter.com/jHRsZqeAiJ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 18, 2023