KTR: మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం లభించింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు. జూన్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదికగా ‘వరల్డ్ ఏఐ షో – మెనా 41వ గ్లోబల్ ఎడిషన్’ జరగనుంది. మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా రావాలని ట్రెస్కాన్ సంస్థ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.
Read Also: Kishan Reddy: ప్రజాజీవనాన్ని సౌలభ్యంగా మార్చడమే మోదీ సర్కారు లక్ష్యం
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్య రంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శించనున్నారు. దుబాయ్‌కు అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఏఐ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించనున్నారు. దీంతో పాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని.. అటువంటి నేతలు పాల్గొంటే సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని ట్రెస్కార్ వ్యవస్థాపకులు ఎండీ మహమ్మద్ సలీం మంత్రికి పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!