ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిందని, ఇప్పటికైన ఈ దిశగా కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని…
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తయారీ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తాను పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ…
మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని..తెలంగాణకు, సమైక్యాంధ్రకు తేడా..శభాష్ పల్లి బ్రిడ్జి నిదర్శనమన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో రహదారులు అభివృద్ధి జరుగుతు న్నాయని..తెలంగాణ వచ్చాక సిరిసిల్ల వాటర్ జంక్షన్ గా మారిందన్నారు. తెలంగాణకు గుండె కాయ మిడ్ మానేరు ప్రాజెక్టు అని..త్వరలో సిరిసిల్లకు రైల్వే లైన్ వస్తుందని పేర్కొన్నారు. మిడ్ మానేరు…
కేటీఆర్ సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం ఆ ప్రజల అదృష్టమని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కెసిఆర్ అని.. ఎవ్వరూ సాహసం చేయని కార్యక్రమాలు సీఎం కెసిఆర్ చేస్తున్నారని కొనియాడారు. పక్క రాష్ట్రల ముఖ్యమంత్రులు సైతం కెసిఆర్ నిర్ణయాలతో ఆశ్చర్య పోతారని.. ముఖ్యమంత్రి…
కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్‌లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్రశ్నించారు.. ఈనాడు తెలంగాణ లో…
సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్.. భారత్-చైనా సరిహద్దులో విధులు కర్నల్ సంతోష్ బాబు విధులు నిర్వహిస్తుండగా.. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 15 జూన్ 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి అమరుడయ్యారు.. ఆయనతో పాటు మరికొందరు భారత సైనికులు అమరులయ్యారు.. ఆ వీరుడు నేలకొరిగి ఏడాది గడిచింది.. దీంతో.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని…
కరోనా మహమ్మారి కాలంలో నేతన్నలకు రూ.109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు తెలంగాణ పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖా మంత్రి కేటీఆర్.. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన ఆయన.. ఈ పథకం ద్వారా కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు.. గత ఏడాది కరోనా నేపథ్యంలో లాకిన్ గడువు కన్నా ముందే నిధులు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్న ఆయన.. ఈ పథకం పునః ప్రారంభం ద్వారా…
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖల 2020-21 సంవత్సర వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఎవరు మమ్మల్ని అడగలేదు..కానీ పారదర్శకత కోసం వార్షిక నివేదికలను విడుదల చేస్తూ ఉన్నామన్నారు. కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని.. దేశ పౌరుని సగటు తలసరి ఆదాయం 1,27,768 ఉంటే …తెలంగాణ రాష్ట్ర పౌరుని తలసరి ఆదాయం 2,27,145గా ఉందని తెలిపారు. 2020-21లో తెలంగాణ ఐటి రంగం ఎగుమతులు 1 లక్ష…
కరోనా వైరస్ మన దేశంలో విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, మృతి చెందుతున్నారు. అయితే ఇటీవల సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతి చెందారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు అంజయ్య కుటుంబం…