వివిధ సమస్యలపై కేంద్రానికి వరుసగా లేఖరాస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా మరో లేఖ రాశారు.. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కోరారు.. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని…
ప్రపంచంలో ఉన్న టాప్ బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి.. మూడు వేల యాక్టివ్ వైఫై హాట్ స్పాట్స్ హైదరాబాద్‌ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చడానికి పనిచేస్తున్నాయని తెలిపారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం ప్రారంభించిన హై-ఫై ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లో 3000కు పైగా పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఫైబర్ నెట్‌తో ప్రజలు స్పీడ్ ఇంటర్నెట్ పొందుతున్నారు.. ఫైబర్ నెట్‌తో ప్రభుత్వం భాగస్వామ్యం…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో…
జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న…
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలను తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కి ఒక లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు మరియు ఇతర శాఖలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే…
గత నెల 24న ఓ సంగీతాభిమాని ఓ యువతి పాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె ప్రతిభను గుర్తించమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశాడు. ఆ వీడియో చూసి ఇంప్రస్ అయిన కేటీఆర్… దాన్ని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు. విశేషం ఏమంటే.. దేవిశ్రీ ప్రసాద్ వెంటనే తప్పకుండా ఆమెకు తగిన గుర్తింపు కలిగేలా చేస్తానని బదులిచ్చాడు. అంతేకాదు… ఆ…
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా, ఈరోజు కొండల్ కుటుంబం తమకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో కలిశారు. తన భర్త కొండల్ 2001 నుంచి…
కృష్ణా జలాల విషయం ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… ఇక, నీటి వివాదంపై ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. ఏపీతోనే కాదు.. దేవుడితో కొట్లాడతాం.. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటాం అన్నారు.. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని ప్రకటించారు..…
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కిటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండీ సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం… మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా,…
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్‌లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్‌రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్‌రావు బతుకే కాంగ్రెస్ అని.. టీడీపీని విమర్శిస్తూనే…