నూతనంగా ఎన్నికైన నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు.
న్యాక్‌లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఐఏఎస్, ఎన్‌హెచ్‌ఆరోవో రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నల్గొండ ఈద్గాలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
Tollywood Biggies Met Minister Komatireddy Venkat Reddy: తెలంగాణలో 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తెలంగాణ రోడ్లు భవనాల శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించి సెక్రటేరియట్ లోని చాంబర్లో కోమటిరెడ్డి…
Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.