Komati Reddy: నాకు పేరు వస్తుందనే ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేపు నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా.. గ్రామంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న నార్కెట్ పల్లి మండలానికి ఈ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నాలుగు నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మార్చి, ఏప్రిల్ లోగా ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. తన కల నిజం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Read also: Modi-Kharge: ఈ సీన్ అదుర్స్.. మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఖర్గే.. నవ్వుతూ ముచ్చట్లు (వీడియో)
మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును సాధించడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. ఆయన కలల ప్రొజెక్ట్ 18 ఏళ్లకు సాకారం అవుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. రేపు సీఎం చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంలా ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందని గత ప్రభుత్వం బ్రాహ్మణ వెళ్ళంలా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఎస్‌ఎల్‌బిసి కూడా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
OnePlus Community Sale 2024: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!