ఆర్ & బీ రివ్యూలో అధికారుల పని తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర మత్తు వీడి రోడ్ల రిపేర్లు చేయాలని ఆదేశించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి? అని ప్రశ్నించారు. మాటలు కాదు –రిజల్ట్ కావాలన్నారు. మీరేమో ప్రతీ రివ్యూలో రోడ్లు బావున్నాయని చెబుతారు.. ప్రజలు రోడ్లు బాలేవంటున్నారు.. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారా? అని మంత్రి స్టేట్ రోడ్స్ అధికారులపై సీరియస్ అయ్యారు. ప్యాచ్ వర్క్ లు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని నిలదీశారు. మనం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న స్పృహ ఉండాలని.. పార్ట్ హోల్స్ నింపకుండా ఏం చేస్తున్నారన్నారు. ప్రతీ వారం రివ్యూ చేయండని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందనను ఆదేశించారు.
READ MORE: Konda Surekha: విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ.. కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు