Minister Kandula Durgesh: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విజయదశమిని పురస్కరించుకొని జనసేన పార్టీ జిల్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు.. పవన్ కల్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అభిమాన్ని చూరగొన్నాయన్న ఆయన.. పవన్…
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా బడ్జెట్, విధానాలు, ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST), ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న టూరిజం కాన్‌క్లేవ్ టెక్ AI 2.0 రెండవ రోజు సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కీలక అభిప్రాయాలను తెలిపాడు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక విధానాల అమలులో గణనీయ పురోగతి సాధించేందుకు మౌలిక…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ సినిమా మండలి కార్యవర్గ సభ్యులు అనుశ్రీ సత్యనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూన్ ఒకటో తేదీన ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదని అన్నారు
థియేటర్ల బంద్‌పై వెనక్కి తగ్గారు ఎగ్జిబిటర్లు.. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ జరిగింది.. ఈ సమావేశానికి దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ రవి శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సితార నాగ వంశీ, బెల్లంకొండ సురేష్, రాధ మోహన్, స్రవంతి రవికిశోర్, బాపినీడు, ఏఎం రత్నం, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.. జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల బంద్‌పై చర్చించారు.. ఆ తర్వాత ఓ కీలక ప్రకటన విడుల చేసింది తెలుగు ఫిల్మ్…
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్... సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హితవుచెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు.? అని ప్రశ్నించారు.
సూర్యలంక బీచ్ కి మహర్దశ వచ్చేసింది.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.
Minister Kandula Durgesh: ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.
రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పరావస్తు పద్యపీఠం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను ఆయన.. చిన్నయ్య సూరి పేరిట సత్కారం చేశారు.. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన చిన్నయ్య సూరి పేరిట సత్కారం పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు..