Off The Record: రండి బాబూ… రండి. ఆలసించిన ఆశాభంగం. హాట్ హాట్‌గా పోస్ట్‌లు రెడీ. మీరు ఏ పార్టీలో ఉన్నా ఫర్వాలేదు. జస్ట్ వచ్చి మా కండువా కప్పుకోండి, నామినేటెడ్ పోస్ట్ పట్టుకోండంటూ బంపరాఫర్స్ ఇస్తోంది అక్కడ జనసేన. అయినా సరే…. అటువైపు చూసేవాళ్లు లేరట. పోస్ట్‌తో పాటు ఎదురు డబ్బులు ఇస్తాం రండర్రా అంటున్నా… ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి ఎక్కడుంది? ఏంటా కథ?
Read Also: Off The Record: టీ-కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు? క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి విచిత్రంగా మారిపోయిందట. మిగతా చోట్ల మాకు పదవులు రాలేదని నాయకులు కొట్టుకుంటుంటే… ఇక్కడ మాత్రం రండిం బాబూ… రండి పదవులిస్తాం అని బతిమాలుకోవాల్సి వస్తోందట. మంచి నామినేటెడ్ పోస్ట్‌లు ఇప్పిద్దామనుకున్నా….నిడదవోలు నియోజకవర్గంలో సరైన జనసేన నాయకులే లేరని అంటున్నారు. దీంతో వైసీపీ నేతలకు గాలం వేసి బేరసారాలాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మా పార్టీలోకి రండి… పదవులు పొందండి… అంటూ నిడదవోలు వైసీపీ లీడర్స్‌కు బంపరాఫర్స్ ఇస్తున్నారట. అయినాసరే… కొందరు ప్రతిపక్ష నాయకులు జనసేన కండువాలు కప్పుకోవడానికి ఊహూ అంటున్నట్టు సమాచారం.
Read Also: Red Sandalwood smuggling: కర్ణాటక పుష్ప.. ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా!
దీంతో ఏం చేయాలో అర్ధంగాక తల పట్టుకోవడం మంత్రి సన్నిహితుల వంతవుతోందట. కూటమి ధర్మం ప్రకారం నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా ఈ నియోజకవర్గంలో జనసేనకు 30 శాతం పదవులు దక్కుతాయి. అయితే ఆ స్థాయిలో పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. సహకార సొసైటీ చైర్మన్ పదవులు నిర్వహించగలిగే సత్తా ఉన్న వాళ్ళు జనసేనలో కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ నేతల దృష్టి ఆయా సొసైటీల పరిధిలోని వైసీపీ నాయకుల మీద పడింది. గ్రామాల్లో ఎక్కడికక్కడ అభ్యర్థుల కోసం ప్రతిపక్ష నేతలకు వల వేస్తున్నారట. నిడదవోలు నియోజకవర్గంలో ఒక్కో మండలానికి 10 సహకార సొసైటీలు ఉన్నాయి. వాటికి ఛైర్మన్స్‌ని నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. కూటమి పదవుల పంపకాల నిష్పత్తి ప్రకారం జనసేనకు మండలానికి మూడు సహకార సొసైటీ చైర్మన్ పదవులు దక్కుతాయి.
Read Also: Off The Record: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రెచ్చిపోతూ గుట్లు బయటేసుకుంటున్నారా?
కానీ, చాలా మండలాల్లో వాటిని తీసుకునే స్థాయి ఉన్న నాయకులే లేరట పార్టీకి. ఉండ్రాజవరం మండలంలోని పాలంగి సొసైటీని ఎవరికి ఇవ్వాలన్న అంశం మీద రోజుల తరబడి చర్చలు జరుగుతున్నా.. కొలిక్కి రావడం లేదు. ఈ మండలంలో మాకు ఐదు సొసైటీలు కావాలంటూ గట్టిగా పట్టుబట్టారు జనసైనికులు. కానీ.. చివరకు లెక్క ప్రకారం మూడు సొసైటీలు దక్కాయి. ఇక్కడే సెటైర్స్ కూడా పడుతున్నాయట. ఆత్రంగా ఐదు సొసైటీలు కావాలని పోరాడారు గానీ… ఇచ్చిన మూడింటికే సరైన అభ్యర్థులు లేరంటూ వెటకారాలాడుతున్నారట కొందరు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఓ గ్రామంలో సొసైటీని ఎలాగైనా దక్కించుకోవాలని జనసేన మండల పరిషత్ సభ్యుడొకరు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. వైసీపీ నుంచి ఒక నాయకుడిని జనసేనలోకి తీసుకువచ్చి సొసైటీ అధ్యక్షుణ్ణి చేయడానికి జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు.. రివర్స్ అయిపోయి పార్టీ ప్రతిష్టకు మచ్చగా మారే పరిస్థితి వస్తోందన్న ఆందోళన జనసేన వర్గాల్లో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Gujarat Honour Killing: చేజేతులా కన్నకూతుర్నే చంపేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇక, పాలంగి సొసైటీ విషయమై కూటమిలో పెద్ద యుద్ధమే జరుగుతోందని అంటున్నారు. గతంలో వైసిపి కోసం పనిచేసి, ఇప్పుడు ఎలాగైనా పోస్ట్ పట్టేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తికోసం జనసేన చెయ్యని ప్రయత్నం లేదు. అయినా సరే… మేటర్ తేలడం లేదు. ఇదిలా ఉంటే పాలంగి సొసైటీ అధ్యక్ష పదవి కోసం భారీగా ముడుపులు చేతులు మారాయన్న ప్రచారం నిడదవోలులో జోరుగా జరుగుతోంది. నిడదవోలు మున్సిపాలిటీలోనూ ఇదే విధానాన్ని అవలంబించి చైర్మన్ పీఠాన్ని జనసేన దక్కించుకుంది. అప్పట్లో ఆ చర్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే… ఇప్పుడు సొసైటీల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ చేయలనుకోవడాన్ని టీడీపీ గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయట.
Read Also: DRDO Manager: బాధ్యతాయుత పదివిలో ఉండి.. ఇలాంటి గలీజు పనులేంటి మాస్టారు!
కాగా, జనసేనకు ఎందుకింత పట్టుదల, వైసీపీ నుంచి ఎవరెవర్నో బతిమాలి, బామాలి, బంపర్ ఆఫర్స్ ఇచ్చి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టాల్సిన ఖర్మ ఏంటంటే.. టీడీపీ భయం అన్నది సమాధానం. ఇప్పుడు గనుక తమకు అభ్యర్థులు లేక పదవుల్ని వదిలేస్తే… అవి ఖచ్చితంగా తెలుగుదేశం ఖాతాలోకే వెళ్తాయని, ముందు ముందు అది తమకు ఇబ్బంది కావచ్చన్న భయంలో ఉన్నారట జనసేన నాయకులు. అదే అవతలి పార్టీ నుంచి అరువు తెచ్చుకుంటే తర్వాత వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారన్నది అసలు లాజిక్ అంటున్నారు. స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే….. ఇక మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ…గ్రామ, మండల స్థాయిలో జనసేనకు సమర్థవంతమైన నాయకులు లేరు. దీంతో… ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలా మారిపోతుందోనన్నది చర్చనీయాంశం అయింది. గ్లాస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా సొంత పార్టీని పటిష్టపరుచుకుంటుందా…! లేక ఇలాగే పక్క పార్టీల వైపు చూస్తుందా అన్నది వాళ్ళే తేల్చుకోవాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.