ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను ఆవిష్కరించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో.. ఈ కొత్త పాలసీని విడుదల చేశారు.. ఇక, నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో చర్చించి ఆహ్వానించారు మంత్రి దుర్గేష్.. అంతేకాదు.. పెట్టుబడిదారుల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. "సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)"ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కార్యాలయం.. ఏపీలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం.. మంత్రి కందుల దుర్గేష్ కృషితో, ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25 (Special…
మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో 'గుంతలు పూడ్చే' పనులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను బాగు చేయలేదని విమర్శించారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చూట్టారు. ఆధ్యాత్మిక యాత్ర బస్సును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద ఉన్న టూరిజం శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్ద నుండి ఆధ్యాత్మిక యాత్ర బస్సు బయలుదేరింది.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును రైల్వే అధికారులను, రహదారులు భవనాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నాం.. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం అన్నారు.. ఇప్పటికే ఎంట్రీ లను ఆహ్వానిస్తున్నాం అన్నారు..