Minister Kakani Govardhan Reddy: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పేరుతో దోచుకోవాలని ప్రయత్నించారని ఆయన విమర్శించారు. పేద ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఏదైనా ఉందా.. అన్నీ కాపీ కొట్టడమేనని ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మహిళలకు బస్‌లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే.. అదే ఇక్కడ చెబుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారం కోసం పనిచేశారు.. కానీ అభివృద్ధి కోసం పని చేయలేదన్నారు. సీపీఎస్ మీద జగన్ హామీ ఇచ్చినా.. ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించారని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: MLA Parthasarathy: వైసీపీ, ప్రభుత్వంపై ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను తొలగిస్తున్నారనే విషయంపై అధికారులతో చర్చించామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ప్రధాన కార్యాలయంతో ఈ విషయంపై చర్చిస్తున్నామని అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు అంగన్ వాఢీ ఉద్యోగులు ముందుకు రావాలని మంత్రి సూచించారు.