సిద్దిపేట జిల్లా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకర కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, సిద్దిపేట సిపి స్వేత ప్రారంభించారు. పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు వాళ్ళు పండుగ, సెలవులు లేకుండా తమ పిల్లలను, ఆరోగ్యాన్ని పక్కన పెట్టీ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు.
ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు.
Minister Harish Rao criticizes BJP: తెలంగాణ రాకపోతే మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీలు వచ్చేవా..? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ లో గురువారం 1000 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మెడికల్ మహబూబ్ నగర్ కి…
తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్ర బాబు అంటూ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర బాబు ఆంధ్ర ప్రజల చేతుల్లో చిత్కరంకు గురి ఆయ్యారని పేర్కొన్నారు. చంద్ర బాబు పాలన బాగా లేదని ఎపి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు.
తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటి పంపిణీని ప్రారంభించారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
మెడికల్ హబ్ గా తెలంగాణ ఎదిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలోని న్యూరో విభాగంలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి ప్రారంభించారు.
కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతుకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి, అధిక ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.