Harish Rao: తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్ర బాబు అంటూ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర బాబు ఆంధ్ర ప్రజల చేతుల్లో చిత్కరంకు గురి ఆయ్యారని పేర్కొన్నారు. చంద్ర బాబు పాలన బాగా లేదని ఎపి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. చంద్ర బాబు హయంలోనే తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యంకు గురి అయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్ర బాబు అంటూ మండిపడ్డారు. తెలంగాణ అన్న యువతపై నక్సల్ ముద్ర వేశారు చంద్ర బాబు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ నా వల్లే అని చంద్ర బాబు అనడం పెద్ద జోక్ అని మంత్రి ఎద్దేవ చేశారు. చంద్ర బాబు హయంలోనే రైతుల ఆత్మహత్య ఎక్కువగా జరిగాయని అన్నారు. చంద్ర బాబువి మాటలు…మావి చేతలు అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Read also: Charles Sobhraj: అల్లుడు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.. చార్లెస్ శోభరాజ్ అత్త
వ్యవసాయం దండగ అన్నాడు చంద్ర బాబు …రైతుల గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదన్నారు. చంద్ర బాబువి మాయ మాటలు అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. చంద్ర బాబు బీజేపీతో ఆంధ్రలో పొత్తు పెట్టుకోవాలని కోరిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఖమ్మంలో సభ పెట్టీ చంద్ర బాబు హడావిడి చేస్తున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ తో పొత్తు కోసమే చంద్ర బాబు డ్రామా ఆడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో చెల్లని రూపాయి…తెలంగాణలో చెల్లుతుందా? అంటూ ప్రశ్నించారు. NTR గురించి మాట్లాడే హక్కు చంద్ర బాబుకు లేదన్నారు. ఇప్పుడు ఉన్న టీడీపీ…NTR పెట్టిన టీడీపీ కాదన్నారు. చంద్ర బాబు ఏ ఎండకు ఆ గొడుగు పెడతారని ఆరోపించారు. నా వల్లే కరోనా వ్యాక్సిన్ అని బీజేపీ ,చంద్ర బాబు అంటున్నారని మండిపడ్డారు.
Read also: Bandi Sanjay: చెప్పుతో కొడితే కొట్టించుకుంటా.. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి
చంద్ర బాబుది భస్మాసుర హస్తం అని హరీష్ రావు ఆరోపించారు. రైతుల కోసం కల్లలు కడితే కేంద్రం తప్పు అంటోందని మండిపడ్డారు. చేపలు ఎండ పెట్టడానికి ఇతర రాష్ట్రాల్లో అనుమతి కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో రైతు కల్లలు వద్దు అని కేంద్రం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయంను ఉపాధి హామీకి అనుసంధానము చేయాలని అసెంబ్లీ కోరిన కేంద్రం స్పందన లేదన్నారు మంత్రి హరీశ్ రావు. కల్లాల నిర్మాణం కోసం ఖర్చు పెట్టిన 150 కోట్లు ఇవ్వాలని తెలంగాణను కోరుతుందని అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల వ్యతిరేఖంగా కేంద్రం తీరు ఉందని, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్డీయే సర్కార్ తీరుకు వ్యతిరేఖంగా BRS ఆందోళనకు చేస్తుందని, కేంద్రం 150 కోట్లు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్ ను ఉపసంహరించుకోవలని కోరారు.
కేంద్రం రైతులను వదలడం లేదు…. ఉపాధి హామీ కూలీలను వదలడం లేదంటూ మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.