సిద్దిపేట మెడికల్ కాలేజీలో నిర్వహించిన పీజీ మొదట సంవత్సరం విద్యార్థుల ఓరియెంటెషన్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ర్యాగింగ్ ని నిషేధించిందని, విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడవద్దని ఆయన సూచించారు. రాష్ట్రం ఏర్పడడం వల్ల మెడికల్ సిట్లలలో 127శాతం గ్రోత్ పెరిగిందని, పీజీ సీట్లలలో 112శాతం పెరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం నుండి బియ్యం సరఫరా చేయాలని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉన్న సిబ్బంది ప్రవర్తన బాగుండదని, ప్రభుత్వ వైద్యులు పేషెంట్లకు చికిత్స అందించే సమయంలో ప్రేమ, ఆప్యాయతను పంచండన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలో సిద్దిపేట మెడికల్ కళాశాల పీజీ విద్యార్థులు బెస్ట్ గా ఉండండని ఆయన వెల్లడించారు. స్వరాష్ట్ర సాధనకు ముందు తెలంగాణ ప్రాంతంలో 2,950 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండగా, ఈ ఏడేండ్ల లో 6,715 సీట్లకు పెంచుకున్నామని, 1,180 పీజీ సీట్లు ఉండగా ఇప్పుడు 2,501 గా సాధించుకున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్ రావు.
Also Read : Rs.2,000 Notes: రూ.2000 నోట్లకు రెండేళ్ల గడువు..! రద్దు చేయండి..
సమైక్య పాలనలో 5 మెడికల్ కళాశాలలు ఉండగా నేడు 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా కో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. ఎంబీబీఎస్ సీట్ల పెంపులో జాతీయ సగటు 71 శాతం ఉండగా, ఏడేళ్లలో ఎంబీబీఎస్ సీట్లను 2,950 నుండి 6,715 కు పెంచుకొని 127 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. పీజీ సీట్ల పెంపులో జాతీయ సగటు 68 శాతం ఉండగా తెలంగాణలో 1,180 నుంచి 2501 సీట్లను పెంచుకొని 112 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు హరీష్ రావు. భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ కోర్సుల సీట్ల సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. మెడికల్ కాలేజీలలో ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీల కొరత ఉందని, గుర్తుతెలియని వ్యక్తుల డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలో ఉపయోగించరాదని చట్టంలో చెప్తున్నందున దాని పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో సంప్రదిస్తున్నట్టు తెలిపారు హరీష్ రావు.