Minister Harish Rao criticizes BJP: తెలంగాణ రాకపోతే మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీలు వచ్చేవా..? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ లో గురువారం 1000 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మెడికల్ మహబూబ్ నగర్ కి కేటాయించారని గుర్తు చేశారు. రూ.50 కోట్లతో నర్సింగ్ కాలేజ్ భవనం నిర్మిస్తాం అని అన్నారు. పాలమూరు జిల్లాపై గత నాయకులందరివీ మొసలి కన్నీళ్లే అని ఆరోపించారు. మహబూబ్ నగర్ ని దత్తత తీసుకుంటా అన్న వ్యక్తి ఎక్కడికి వెళ్లాడని చంద్రబాబును విమర్శించారు. జాతీయ స్థాయి నాయకులు ఉన్నా మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు.
Read Also: Indra Karan Reddy: మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..బీఆర్ఎస్ విస్తరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో క్రియాశీలకంగా మారుతామని మంత్రి హరీష్ రావు చెప్పారు. దేశంలో తెలంగాణ వైద్య సేవల విషయంలో మూడో స్థానంలో ఉందని.. యూపీకి చెందిన మంత్రి మహేంద్ర నాథ్ సొంత రాష్ట్రం చివరి స్థానంలో ఉందని అన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి మన ఆసుపత్రులు బాగా లేవని అంటున్నాడని ఎద్దేవా చేశారు. కృష్ణా నది జలాల్లో వాటా తేల్చండి.నికర జలాలు కేటాయించమంటే ఎనిమిది యేండ్లు గా నాన్చుతున్నారని మండిపడ్డారు.
పేదలకు మెరుగైన వసతులు అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని..మహబూబ్ నగర్ ను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం అని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సరైన వైద్య సేవలు అందక గతంలో ఎంతో మంది మరణించారని.. ప్రభుత్వ ఆసుపత్రులనున బలోపేతం చేశామని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ర్టాల నుండి ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి వచ్చే విధంగా చేస్తామని వెల్లడించారు. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఐదు జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.