Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 2014నుంచి 2022వరకు మాతృమరణాలు గణనీయంగా తగ్గాయని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డా సంరక్షణకు పెద్ద పీట వేస్తుంది. ఈనేపథ్యంలో సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది.
వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు. ఇక.. కొండపాకలో కొత్తగా నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.