వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చింది.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుంది.. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనువు బీజేపీతో మనస్సు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేష్, సత్య కుమార్, సుజనా వంటి వారి మాటలను నడ్డా చెవికెక్కించుకుంటే నడ్డా ఖర్మ.. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కోసం విశాఖ ఉక్కు పీక కోయడంలో ల్యాండ్ స్కాం ఉంటుంది అని ఆయన అన్నారు.
Read Also: Post office franchise: రూ.5000వేలతో పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోండి.. నెలకు లక్ష సంపాదించండి
విశాఖ ఉక్కు పీక కొద్దామనే ఆలోచన వెనుక విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేట్ వారికి ఇచ్చేస్తారేమోననే అనుమానం ఉంది అని పేర్నినాని అన్నారు. అదానీకి, వేదాంతకు క్యాప్టివ్ మైన్లు కట్టబెట్టిన కేంద్రం.. విశాఖ ఉక్కుకు ఎందుకు క్యాప్టీవ్ మైన్ ఎందుకివ్వడం లేదు..? అమరావతి, పోలవరం గురించి గత ఎన్నికల ముందు ఏం మాట్లాడారు..?, ఇప్పుడేం మాట్లాడుతున్నారు..?, అమరావతి పాపాలను.. అక్రమాలపై బీజేపీ ఏం సమాధానం చెబుతుంది..? అని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ-బీజేపీ నేతలు ఇసుకను పంచుకున్నారు.. మిద్దెలు కట్టుకున్నారు అని కామెంట్ చేశారు.
Read Also: AAP: ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్ ర్యాలీ.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
అమరావతిలో ల్యాండ్ స్కాం అన్న బీజేపీ నేతలు.. ఢిల్లీలో విపక్షాలు అనేక ఆరోరణలు.. విమర్శలు చేస్తున్నాయి.. నడ్డాకు చేతనైతే ఢిల్లీలో కూర్చొని వాటికి సమాధానం చెప్పాలి అని పేర్నినాని విమర్శలు గుప్పించాడు. జగన్ ప్రభుత్వం రూ. 2.16 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేసింది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేం చేస్తున్న సంక్షేమంలో సగమైనా చేశారా..? ఆ చరిత్ర మీకుందా..? అంటూ ప్రశ్నించారు. పచ్చ పువ్వుల మాటల విని మాట్లాడ్డం సరికాదు నడ్డాజీ అంటూ పేర్కొనాని పేర్కొన్నారు.
Read Also: Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. రాష్ట్రంలో పవర్ కట్
హరీష్ రావుకు మేనమామ మీద, బావ మీద ఉన్న కోపం, ఈర్ష్య ఉంది అని పేర్నినాని అన్నారు. కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టి పన్మిషెంట్ వేశారు.. 2018లో హరీష్ రావు కేసీఆర్ కెబినెట్లో ఎందుకు లేరు..? ఎందుకంటే.. హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవుతున్నారు.. మమ్మల్ని విమర్శిస్తే.. మేం తిరిగి కేసీఆరును విమర్శిస్తామని హరీష్ రావు ఆలోచన.. మేం కేసీఆరును విమర్శిస్తే హరీష్ రావు సంతోషించాలని అనుకుంటున్నారు.. కానీ మేం మళ్లీ హరీష్ రావుపైనే విమర్శలు చేస్తామని మాజీమంత్రి పేర్నినాని అన్నాడు.