కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్... ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్‌కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు
మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్... తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు .
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు మంత్రి అమర్నాథ్.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు.
Buddha Venkanna: కాపులు వంద శాతం పవన్ కల్యాణ్‌కే ఓటేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.. అసలు అమర్నాథ్ వన్ టైం ఎమ్యెల్యే అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, చంద్రబాబు ఇంటి గేటును టచ్ చేస్తే రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు బుద్ధా వెంకన్న.. పోలీసులుతో కాకుండా మీ పార్టీ పిచ్చికుక్కలను…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజాగా పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పొత్తులు, సీఎం అభ్యర్థి విషయం చేసిన కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేవారు.. పవన్ కళ్యాణ్ పార్టీని నదపలేనని చేతులు ఎత్తేశారన్న ఆయన.. జనసేన కాదు అది జెండా సేన.. ప్రతీ ఎన్నికల్లోనూ ఎదో ఒక పార్టీ జెండా మోయడమే పని అని ఎద్దేవా చేశారు. జనసైనికులు ఇక నుంచి…
Gudivada Amarnath: వారి బాధ చూస్తుంటే జాలి వేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక టీడీపీ, వారి మీడియా విషం కక్కుతోందని మండిపడ్డారు.. వారి బాధ చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు.. ఇక, ఈ నెల 22న బందరు పోర్టుకు శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించారు మంత్రి అమర్నాథ్.. రాష్ట్రంలో లక్షా 30 వేల మందికి సచివాలయాల్లో ఉద్యోగ అవకాశాలు…